కర్నూలు(అగ్రికల్చర్): ఇటీవల వరకు రైతులను మురిపించిన కందుల ధర తగ్గుతోంది. ఒక దశలో క్వింటం రూ.13,000కు పైగా పలికింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నాఫెడ్ గత ఏడాది బహిరంగ మార్కెట్ ధరకే కందులను కొనుగోలు చేసింది. ఈ సారి కూడా నాఫెడ్ బహిరంగ మార్కెట్ ధర ప్రకారం కందుల కొనుగోలుకు ముందుకు వచ్చి మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపింది. 2024 ఖరీఫ్‌లో సాగు చేసిన కంది పంట కొద్ది రోజులుగా మార్కెట్‌కు వస్తోంది. క్రమంగా ధర తగ్గుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డుకు 271 మంది రైతులు 1,797 క్వింటాళ్ల కందులు తెచ్చారు. కనిష్ట ధర రూ.1,156, గరిష్ట ధర రూ.7,649 లభించింది. సగటు ధర రూ.7019 నమోదైంది. నూర్పిడిలో ముక్కలు, పగిలిన కందులను ప్రత్యేకంగా కొనుగోళ్లు చేస్తున్నారు. ఇటువంటి కందులు మార్కెట్‌కు 45 క్వింటాళ్లు వచ్చింది, దీనికి క్వింటాలుకు కనిష్టంగా రూ.706, గరిష్టంగా రూ.3600 లభించింది.సగటు ధర రూ.3,200 లభించింది. కందులకు మద్దతు ధర రూ.7550 ఉంది. మద్దతు ధర కంటే తక్కువకు ధరలు పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment