కర్నూలు(సెంట్రల్): 2025 మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే రెగ్యులర్ విద్యార్థులు, ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థులు తత్కాల్ కింద రూ. 1000 అపరాధ రుసుంతో పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం ఉందని డీఈఓ శామ్యూల్ పాల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 27 నుంచి జనవరి 10వ తేదీలోపు చెల్లించేందుకు అవకాశం ఉందన్నారు.
సచివాలయాల్లో ఎస్సీ కులాల సర్వే డేటా
కర్నూలు(అర్బన్): జిల్లాలోని గ్రామ/ వార్డు సచివాలయాల్లో షెడ్యూల్డు కులాల సర్వే డేటాను ప్రచురించడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ డా.బీ నవ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ డేటాను ప్రజలు పరిశీలించి ఏవైనా తప్పిదాలు ఉంటే ఈ నెల 31వ తేదీలోగా అభ్యంతరాలను తెలియజేయవచ్చన్నారు. స్వీకరించిన అభ్యంతరాలను ఆన్‌లైన్, డేటా ధ్రువీకరణ జనవరి 6వ తేదీ వరకు జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియ పూర్తి అయిన అనంతరం 2025 జనవరి 10వ తేదీన సచివాలయాల్లో ఆయా కులాల తుది సర్వే డేటాను ప్రచురించడం జరుగుతుందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment