కొబ్బరి ఉత్పత్తులతో రైతులకు మేలు
నంద్యాల(అర్బన్): వేరు నుంచి కాయ, పీచు వరకు కొబ్బరి ఉత్పత్తులు రైతులకు ఎంతగానో ఉపయోగపడుతాయని తూర్పు గోదావరి జిల్లా వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ సైంటిస్ట్ డాక్టర్ తిరుపతిరెడ్డి తెలిపారు. స్థానిక వైఎస్సార్ సెంటినరీ హాల్‌లో శుక్రవారం జిల్లా ఉద్యానవన శాఖ అధికారి నాగరాజు ఆధ్వర్యంలో శాసీ్త్రయ కొబ్బరి సాగుపై జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. కొబ్బరి అభివృద్ధి బోర్డు పర్యవేక్షణలో జరిగిన సమావేశంలో తిరుపతిరెడ్డి మాట్లాడుతూ కొబ్బరి ఉత్పత్తులు ఉపయోగకరమని, కొబ్బరి సాగులో విత్తన ఎంపికే కీలకమన్నారు. కొబ్బరి అభివృద్ధి బోర్డు డెవలప్‌మెంట్ ఆఫీసర్ శరత్ మాట్లాడుతూ కొబ్బరి సాగులో చీడపీడల నివారణ ప్రధానమన్నారు. హార్టికల్చర్ అధికారి నాగరాజు మాట్లాడుతూ కొబ్బరి సాగు రైతులు ఎకరాకు 60 మొలకలు నాటితే మంచి దిగుబడులు సాధించుకోవచ్చన్నారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్, ఉద్యానవన శాఖ ద్వారా అందించే సబ్సిడీలను సద్వినియోగం చేసుకుంటూ కొబ్బరి సాగు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో అధికారులు కొబ్బరి అభివృద్ధి బోర్డు డీడీ కుమారవెల్, కిరణ్‌కుమార్, సత్యనారాయణ, హెచ్‌ఓ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment