‘విజయ’ం అడ్డుకునే కుట్ర
నంద్యాల(అర్బన్): అడ్డదారిలో విజయ డెయిరీ చైర్మన్ పదవిని దక్కించుకోవాలనే దురుద్దేశంతో టీడీపీ నేత లు బరితెగించారు. ప్రశాంతంగా జరగాల్సిన డైరెక్టర్ల ఎన్నిక ప్రక్రియ ఉద్రిక్తతకు దారి తీసి చివరికి వాయిదా పడేలా చేశారు. విజయడెయిరీలో మొత్తం 15 మంది డైరెక్టర్లు ఉన్నారు. ఇందులో ఇటీవల ము గ్గురు డైరెక్టర్ల పదవీ కాలం పూర్తయ్యింది. శుక్రవారం ఆ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. విజయ డెయిరీ ఎండీ కార్యాలయంలో 11 నుంచి 2 గంటల వరకు నామినేషన్లు స్వీకరించాల్సి ఉంది. పోటీ లేకపోతే ఎన్నికల అధికారులు ఇదే రోజు ఏకగ్రీవంగా డైరెక్టర్ ఎన్నికై నట్లు ప్రకటించాల్సి ఉంది. ఈ క్రమంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ వర్గీయులు ఎన్నికల్లో పోటీ చేస్తే గెలవలేమనే ఉద్దేశంతో ఎన్నిక వాయిదా వేయించేందుకు అలజడి సృష్టించినట్లు తెలుస్తోంది. తమను కాదని పోటీలో నిలిచే వారిని ముందుగా భయభ్రాంతులకు గురి చేసి తమ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా పథకం పన్నారు. ఈ క్రమంలోనే దాదాపు 30 వాహనాల్లో నంద్యాలలోని విజయ డెయిరీ వద్దకు చేరుకున్నారు. అయినా పలువురు ధైర్యంగా నామినేషన్ వేసేందుకు డెయిరీ లోపలికి వెళ్తుండగా అడ్డుకునే ప్రయత్నం చేశారు. చివరకు ఆఫీసులోకి వచ్చేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారించారు. అయినా తగ్గకుండా కేకలు వేస్తూ హల్‌చల్ చేశారు. వారిని అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చివరకు పోలీసు లు చేతులెత్తేసి బందోబస్తు కల్పించలేమని ఎన్నిక వా యిదా వేయాలంటూ ఎన్నికల అధికారి రాంబాబుకు విన్నవించారు. విధిలేని పరిస్థితుల్లో ఎండీ ప్రదీప్‌కుమార్ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
అడ్డదారిలో చైర్మన్ పదవి కట్టబెట్టాలని..
అడ్డదారిలో డైరెక్టర్లను గెలిపించుకుని ఆళ్లగడ్డ ఎమ్మె ల్యే అఖిలప్రియ సోదరుడు భూమా జగత్ విఖ్యాత్‌రెడ్డికి చైర్మన్ పదవి కట్టబెట్టేందుకు టీడీపీ నాయకులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా విజయడెయిరీ పాలకమండలి సమావేశం జరగకుండా స్టే ఇవ్వాలంటూ ఇటీవల టీడీపీ నాయకులు హైకోర్టులో వేసిన పిటిషన్ తిరస్కరణకు గురైంది. ఎన్నికల నిర్వహణను అడ్డుకోవాలని చేసిన ప్రయత్నాలు సైతం విఫలమయ్యాయి. ప్రస్తుతం విజయడెయిరీ చైర్మన్‌గా ఉన్న ఎస్వీ జగన్‌మోహన్‌రెడ్డి పదవీ కాలం మరో ఏడాది పొడిగిస్తూ ఇటీవల డైరెక్టర్లు తీర్మానం చేశారు. దీంతో కార్యవర్గ సభ్యుల పదవీ కాలం ముగిసే వరకు అధ్యక్ష పదవికి ప్రత్యేక ఎన్నిక జరగాల్సిన అవసరం లేదు. అయితే ముగ్గురు డైరెక్టర్ల ఎన్నికల్లో తమ వారిని అడ్డదారిలో గెలిపించుకుని ఆ తర్వాత పావులు కదపాలనే దురద్దేశంతోనే శుక్రవారం జరగాల్సిన ఎన్నిక ప్రక్రియను అడ్డుకున్నారనే విమర్శలు ఉన్నాయి.
విజయ డెయిరీ నామినేషన్ల స్వీకరణలో
ఉద్రిక్తత
ఎమ్మెల్యే అఖిలప్రియ వర్గీయుల
హల్‌చల్
శాంతిభద్రతల సమస్య అంటూ
చేతులెత్తేసిన పోలీసులు
వాయిదా పడిన నామినేషన్ల స్వీకరణ
Comments
Please login to add a commentAdd a comment