స్వచ్ఛదివస్‌పై ప్రజలకు అవగాహన కల్పించండి
కర్నూలు(సెంట్రల్): ‘న్యూ ఇయర్–క్లీన్ స్టార్ట్’ అనే థీమ్‌తో నిర్వహించే స్వచ్ఛ దివస్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ పి.రంజిత్‌బాషా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి వీడి యో కాన్ఫరెన్స్ ద్వారా స్వచ్ఛ దివస్, హౌసింగ్, రెవె న్యూ సదస్సులు, పీజీఆర్‌ఎస్, ఉపాధి హామీ తదితర అంశాలపై మండల స్థాయి అధికారులు, డివిజన్ స్థాయి, అధికారులు, ప్రత్యేకాధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వచ్ఛదివస్ కార్యక్రమాన్ని శనివారం జిల్లాలోని అన్ని పంచాయతీలు, మునిసిపాలిటీల్లో ప్రారంభించాలన్నారు. స్వచ్ఛాంధ్ర–స్వచ్ఛ దివస్‌లో భాగంగా ప్రతి మూడో శనివారం పచ్చదనం–పరిశుభ్రతను పాటించాలన్నారు. ఉపాధి హామీ పనుల కల్పనలో అధికారులు అలసత్వం వీడాలన్నారు. మంత్రాలయం, గూడూరు, గోనెగండ్ల, కోసిగి మండలాల్లో ప్రజలు వలస వెళ్తున్నారని, పత్రికల్లో కథనాలు వస్తున్నాయని, అందుకు కారణాలపై ఎంపీడీఓలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న గోకులాల పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. రీసర్వే గ్రామాల గ్రామసభలు, రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీల పరిష్కారంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంఎస్‌ఎంఈ సర్వేలో జిల్లా పురోగతిలో వెనుకబడి ఉందని, వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జేసీ డాక్టర్ బి.నవ్య, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కల్యాణి, హౌసింగ్ పీడీ చిరంజీవి, జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి పాల్గొన్నారు.
కలెక్టర్ రంజిత్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment