No Headline | - | Sakshi
Sakshi News home page

No Headline

Published Sat, Jan 18 2025 1:38 AM | Last Updated on Sat, Jan 18 2025 1:38 AM

No Headline

No Headline

కోడుమూరు రూరల్‌: అతివేగం ముగ్గురు వ్యక్తులను బలితీసుకుంది. శుక్రవారం ప్యాలకుర్తి వద్ద లారీ, ఐచర్‌ వాహనం ఎదురెదురుగా వేగంగా ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కోడుమూరుకు చెందిన సోమశేఖర్‌ (56), బండ శ్రీనివాసులు (46), రాజోలి శ్రీను (36) పట్టు వస్త్రాల వ్యాపారం చేస్తున్నారు. వీరు ముగ్గరు కారులో కర్నూలుకు వెళ్లి తిరిగి వస్తున్నారు. ప్యాలకుర్తి గ్రామ సమీపాన ఆర్‌టీసీ బస్సును ఓవర్‌టేక్‌ చేస్తుండగా ఎదురుగా వేగంగా వస్తున్న ఐచర్‌ వాహనం, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమా దంలో కారులోని బండ శ్రీనివాసులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రగాయాలకు గురైన సోమశేఖర్‌, రాజోలి శ్రీనులను చికిత్స నిమిత్తం కోడుమూరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు. మృతుడు సోమశేఖర్‌ కోడుమూరులోని 16వ వార్డు సభ్యుడు. ఈయనకు భార్య జయలక్ష్మి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బండ శ్రీనివాసులుకు భార్య శ్రీలలిత, ఇద్దరు కుమారులు, రాజోలి శ్రీనుకు భార్య సుమశ్రీ, ఇద్దరు కుమార్తెలు, ఏడాదిలోపు బాబు ఉన్నారు. ప్రమాదం విషయం తెలుసుకున్న కోడుమూరు సీఐ తబ్రేజ్‌, ఎస్‌ఐ శ్రీనివాసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మృతుల కుటుంబ సభ్యులకు పరామర్శ

విషయం తెలుసుకున్న కుడా మాజీ చైర్మన్‌ కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి, జెడ్‌పీటీసీ సభ్యుడు రఘునాథ్‌రెడ్డి, గ్రామ సర్పంచ్‌ భాగ్యరత్న, మాజీ సింగిల్‌ విండో అధ్యక్షుడు క్రిష్ణారెడ్డి, మాజీ సర్పంచ్‌ సీబీ లత, మాజీ ఉప సర్పంచ్‌ ప్రవీణ్‌కుమార్‌ తదితరులు కోడుమూరు ప్రభుత్వాసుపత్రి చేరుకున్నారు. మార్చురీలో ఉన్న మృతదేహాలను సందర్శించారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో మృతిచెందిన ముగ్గురిది ఒకే సా మాజిక వర్గం కావడం, వరుసకు బంధువులు కావడంతో కోడుమూరులో విషాదఛాయలు అలుముకున్నా యి. కోడుమూరు ప్రభుత్వాసుపత్రి వద్ద మృతుల కుటుంబీకుల, బంధువుల రోదనలు మిన్నంటాయి.

రెండు వారాల్లో ఆరుగురు మృతి ..

కోడుమూరు – కర్నూలు రహదారిలో రెండు వారాల్లో మూడు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఆయా ప్రమాదాల్లో కోడుమూరుకు చెందిన ఆరుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ప్యాలకుర్తి, కొత్తూరు గ్రామాల సమీపానే ఈ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో ఈ రోడ్డుపై ప్రయాణించాలంటేనే వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement