మానసిక వికలాంగులకు న్యాయ సేవలు అందించాలి
కర్నూలు(సెంట్రల్): మానసిక అనారోగ్యం, వైకల్యంతో బాధపడేవారి కోసం అనేక చట్టాలు ఉన్నాయని, వారికి చట్టపరమైన సేవలు అందించేందుకు న్యాయవాదులు కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూ ర్తి, జిల్లా న్యాయ సేవాధికారసంస్థఅధ్యక్షుడు జస్టిస్ కబర్ది సూచించారు. శనివారం జిల్లా న్యాయ సేవాధికార కార్యాలయంలో కర్నూలు, నంద్యాల జిల్లాల ప్యానెల్ న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్లకు మానసిక అనారోగ్యం, వైకల్యం బాధితుల కోసం జాతీయ న్యాయసేవాధికార సంస్థ తెచ్చిన బాలల సంరక్షణ న్యాయ సేవలు–2024 పథకంపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జస్టిస్ కపర్ది మాట్లాడుతూ.. చట్టం పరంగా మానసిక ఆరోగ్యం, వైకల్యాలతో బాధపడేవారికి చట్టం పరంగా రావాల్సిన, చేయాల్సిన సేవలను వర్తింపజేసేందుకు న్యాయవాదులు ప్రయత్నించాలన్నారు. న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలాశేషాద్రి, శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ ఎం.వెంకట హరినాథ్ మాట్లాడుతూ.. బాలల సంరక్షణ..స్నేహ పూర్వక న్యాయ సేవలు పథకం–2024పై న్యాయ న్యాయవాదులు పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎం.శివరామచంద్రరావు, చైల్డ్ వెల్ఫే ర్ కమిటీసభ్యుడు క.వెంకట రామయ్య, అసిస్టెంట్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ రేవతి జ్యోత్స్న పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment