తూర్పు కనుమల్లో భాగమైన
నల్లమల అడవులంటేనే జీవవైవిధ్యానికి పెట్టింది పేరు. ఏనుగు,సింహం తప్ప తక్కిన జంతువులన్నింటికీ ఈ అడవి ఆవాసప్రాంతంగా నిలిచింది. 17 రకాల కార్నివోర్స్ (మాంసాహార జంతువులు), 8 రకాల హెర్బీవోర్స్ (శాకాహార జంతువులు)తో పాటు పలు రకాల పక్షులు, సరీసృపాలు, చేపలు, ఉభయచర జీవులు, కీటకాలు తదితర జంతుజాలం ఈ అడవిలో సహజీవనం చేస్తూ బయోడైవర్సిటీకి ప్రతిరూపంగా నిలుస్తున్నాయి. 8 రకాల హెర్బీవోర్స్‌లో ఏడు రకాలు జింకలే ఉండటం విశేషం. వీటిల్లో 300 కేజీల బరువు తూగే కణితి (సాంబర్), మనిమేగం(నీల్‌గాయ్) వంటి భారీ జింకలతో పాటు కుందేలు కంటే కాస్త చిన్నదిగా కనిపించే మౌస్‌డీర్ (మూషిక జింక)సైతం ఉన్నాయి. నాగార్జున సాగర్– శ్రీశైలం అభయారణ్యం పరిధిలోని ఆత్మకూరు అటవీ డివిజన్‌లో ఇవి అధిక సంఖ్యలో సంచరిస్తున్నాయి.
– ఆత్మకూరురూరల్
Comments
Please login to add a commentAdd a comment