నిలవని ప్రేమ వివాహాలు..
తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమవివాహాలు చేసుకోవడం ఇటీవల కాలంలో అధికమైంది. కొందరు తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకుంటుండగా మరికొందరు ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంటూ వేరుగా ఉంటున్నారు. ఆ తర్వాత ఏడాది, రెండేళ్లకే విడిపోయి తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరుకుంటున్నారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో వారానికి రెండు, మూడు కేసులైనా అమ్మాయి మిస్సింగ్ అని నమోదవుతున్నాయి. ఇలాంటి ఘటనలు ఇటీవల అధికంగా చూస్తున్న పోలీసులు చాలా మంది అమ్మాయిని వెతకడం అటుంచి రెండురోజులకు వారే వస్తారులే అన్న ధోరణితో మాట్లాడుతున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల్లో వచ్చే చిన్న చిన్న మనస్పర్థలను సర్దిచెప్పేవారు లేక రెండు, మూడేళ్లకే విడిపోతున్నారు. పోలీస్‌స్టేషన్‌లు, వన్‌స్టాప్ సెంటర్లు, ఐసీడీఎస్ కార్యాలయాల్లో ఇలాంటి వారికి కౌన్సిలింగ్ నిర్వహించే ఉదంతాలు ఇటీవల అధికమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment