పలకరించి ఎన్నాళ్లైందో..
ఒకప్పుడు ఇంటికి బంధువులు, స్నేహితులు వస్తే గంటల తరబడి మాట్లాడుకుంటూ ఉండిపోయేవారు. సమయానికి భోజనం చేయాలన్న విషయం కూడా మరిచిపోయేవారు. కుటుంబంతో పాటు ఊళ్లో, సమాజంలో ముచ్చట్లు, రాజకీయాలు, సినిమాలు అన్నీ ఈ మాటల్లో కనిపించేవి. కానీ ఇప్పుడు ఇంటికి ఎవ్వరైనా వస్తే ముఖస్తుతిగా పలకరించి రెండు నిమిషాలు మాట్లాడి వదిలేస్తున్నారు. ఎవ్వరి మొబైల్‌లో వారు బిజీగా గడుపుతున్నారు. ఎదురుగా ఉన్న వారిని పలకరించే సమయం లేకపోయినా ఎక్కడా కనిపించని వారిని సోషల్ మీడియాలో పలకరించుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment