5న వైఎస్సార్‌సీపీ ఫీజు పోరు
● ఎనిమిది నెలల కూటమి పాలనలో
విద్యా వ్యవస్థ తిరోగమనం
● ఫీజు బకాయిల పెండింగ్‌తో
విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన
● కళాశాలల యాజమాన్యాలు వేధిస్తున్నా
కూటమి ప్రభుత్వం మొద్దు నిద్ర
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు
ఎస్వీ మోహన్ రెడ్డి
ఫీజు పోరును విజయవంతం చేయండి
ఫిబ్రవరి 5వ తేదీన వైఎస్సార్‌సీపీ చేపట్టే ఫీజు పోరు నిరసన కార్యక్రమానికి విద్యార్థిని, విద్యార్థులు, తల్లిదండ్రులు, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం నాయకులు, విద్యార్థి సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఎస్వీ మోహన్‌రెడ్డి పిలుపు నిచ్చారు. బుధవారం స్థానిక రాజ్ విహార్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేస్తామన్నారు. పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మద్దూరు సుభాష్ చంద్రబోస్, విద్యార్థి సంఘం నాయ కులు, పార్టీ వివిధ విభాగాల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
కర్నూలు (టౌన్): విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంటు, స్కాలర్ షిప్‌లు, పాత బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 5వ తేదీన ‘వైఎస్సార్‌సీపీ ఫీజు పోరు’ పేరుతో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి తెలిపారు. పెండింగ్‌లో ఉన్న రూ.3,900 కోట్ల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్‌లోని సమావేశ హాలులో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఫీజు పోరు పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థులు చదువుకు దూరం కాకుడదని ఆనాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్‌ఆర్ ఫీజు రీయింబర్స్ మెంటు పథకా న్ని తీసుకువచ్చి ఉన్నత చదువులకు బాటలు వేశారన్నారు. చదువుకు భరోసా ఇవ్వడంతో ఎంతో మంది ఇంజినీర్లు, డాక్టర్లు అయ్యారన్నారు. అదే స్ఫూర్తితో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గత ఐదేళ్ల పాటు ప్రతి త్రైమాసికం విద్యార్థుల ఫీజును కళాశాలల యాజమాన్యాలు, తల్లిదండ్రుల ఖాతాలో వేశారని గుర్తు చేశారు. జగనన్న పాలనలో విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. గత విద్యా సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో రూ.12,609 కోట్లు, విద్యాదీవెన, వసతి దీవెన పథకాలకు రూ.18 వేల కోట్లు చెల్లించారన్నారు. కూటమి ప్రభుత్వం మాత్రం పేదలు, సామాన్యులు, మధ్య తరగతి పిల్లలు భవిష్యత్‌తో చెలగాటమాడుతుందని విమర్శించారు. సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదన్నారు. ఇంగ్లిషు మీడియం, 3వ తరగతి నుంచే టోఫెల్ సబ్జెక్టు టీచర్లను రద్దు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. సీబీఎస్‌ఈ నుంచి ఐబీ దాక ట్యాబ్‌లు, బైజూస్ కంటెంట్లు మూలకు పడేశారన్నా రు. వసతి దీవెన, విద్యాదీవెన లేక విద్యార్థులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. మరోవైపు కళాశాలల యాజమాన్యాలు ఫీజు చెల్లించాలని వేధిస్తున్నా కూటమి ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదన్నారు. పరీక్షల హాల్ టిక్కెట్లు ఇవ్వకుండా మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయన్నారు. షాడో ముఖ్యమంత్రిగా మారిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు విద్యార్థుల సమస్యలు కనిపించకపోవడం దారుణమన్నారు. కార్పొరేట్‌కు కొమ్ముకాస్తున్న కూటమి ప్రభుత్వం పేదల చదువులు, ప్రభుత్వ బడులను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తుందని విమర్శించారు. ఫీజు బకాయిలు చెల్లించ కుంటే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment