దంతాలపల్లి: కారు అతివేగంతో అదుపుతప్పి రోడ్డుపై పల్టీలు కొడుతూ రోడ్డుపక్కన ఉన్న చెట్టు, విద్యుత్ స్తంభం మధ్యలో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం కేంద్రంలో శనివారం తెల్లవారుజామున జరిగింది. మృతులు నిర్మల్ జిల్లావాసులు. స్థానికులు, ఎస్‌ఐ కూచిపూడి జగదీశ్ తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్‌కు చెందిన అన్వర్‌ఖాన్ ఖమ్మం జిల్లా మధిర హైడ్రాలిక్ క్రేన్ కొనుగోలు చేశాడు. దానిని తీసుకువచ్చేందుకు శుక్రవారం రాత్రి 10.30 గంటలకు నిర్మల్‌నుంచి కారులో డ్రెవర్ అబ్దుల్ సమీర్(21), క్రేన్ డ్రైవర్ షేక్ అలీముద్దిన్(21), హెల్పర్ షేక్ రెహాన్‌తో కలిసి అన్వర్‌ఖాన్ బయలు దేరారు. శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో దంతాలపల్లి మండలకేంద్రంలోని యూనియన్ బ్యాంక్ సమీపంలోకి రాగానే గేదె అడ్డురావడం.. అప్పటికే కారు వేగం మీద ఉండడంతో అదుపుతప్పి రోడ్డుపై 20 మీటర్ల దూరం వరకు పల్టీలు కొట్టింది. ఆ తరువాత రోడ్డు పక్కన ఉన్న చెట్టు, విద్యుత్ స్తంభానికి మధ్యలో చిక్కుకుపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలా నికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదంలో అలీముద్దిన్(21) అక్కడికక్కడే మృతిచెందాడు. కారుడ్రైవర్ అబ్దుల్ సమీర్(21)ను అస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. అన్వర్‌ఖాన్, రెహాన్ తీవ్రగాయాలు కాగా, వారిని చికిత్స నిమిత్తం తొర్రూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మృతుడు సమీర్ మామ మహ్మద్ పాషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. తొర్రూరు సీఐ సత్యనారాయణ ఈ ప్రమాదానికి గల కారణాలను విచారణ చేపట్టనునట్లు ఎస్పై జగదీష్ తెలిపారు. ప్రమాద సమయంలో కారు అతివేగం మీద ఉందని, అందుకే కారు గాలిలో ఎగురుతూ పల్టీలు కొట్టినట్లు స్థానికులు తెలిపారు.
అబ్దుల్ సమీర్(ఫైల్)
అలీమొద్దీన్(ఫైల్)
కారు అదుపు తప్పి రోడ్డుపై పల్టీలు
ఇదరి దుర్మరణం..
మరో ఇద్దరికి తీవ్రగాయాలు
మృతులు నిర్మల్ జిల్లావాసులు
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో ఘటన
Comments
Please login to add a commentAdd a comment