విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
దంతాలపల్లి: అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అన్నారు. గురువారం మండలంలోని గున్నెపల్లి, ఆగపేట గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టిన సర్వేను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు అందించేందుకు సిద్ధం కావాలన్నారు. అనంతరం మండల కేంద్రంలో పోలీస్‌స్టేషన్‌కు కేటాయించిన స్థలం, అంగన్‌వాడీ సెంటర్, గ్రామపంచాయతీ కార్యాలయాలను పరిశీలించారు. అలాగే మండల కేంద్రంలోని పీహెచ్‌సీని పరిశీలించి, ప్రజలకు అందుతున్న వైద్యం, ఆస్పత్రిలోని వసతులపై ఆరా తీశారు. బుధవారం ఆస్పత్రిలో జరిగిన ఘటనపై విచారణ చేయాలని డీఎంహెచ్‌ఓను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వివేక్‌రామ్, వైద్యురాలు చైతన్య, ఏఓ వాహిని, డిప్యూటీ తహసీల్దార్ శ్రీలత, ఆర్‌ఐ నజిముద్దీన్, ఎంపీఓ అప్సర్‌పాషా, ఏఈఓలు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
సర్వేను సక్రమంగా చేపట్టాలి
నర్సింహులపేట: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్వేను క్షేత్రస్థాయిలో సక్రమంగా చేయాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అన్నారు. గురువారం మండలంలోని నర్సింహులపేట, ముంగిమడుగు గ్రామాల్లో అధికారులు చేపడుతున్న సర్వేను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ చప్పిడి నాగరాజు, ఎంపీడీఓ మాధవి, ఎంపీఓ కిన్నెర యాకయ్య, ఏఓ వినయ్‌కుమార్, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
పకడ్బందీగా నిర్వహించాలి
చిన్నగూడూరు: ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకా లు ప్రజలకు పారదర్శకంగా అందించేలా సర్వే పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ ఆదేశించారు. గురువారం మండలంలోని చిన్నగూడూరు, గుండంరాజుపల్లి గ్రామాల్లో కలెక్టర్ పర్యటించారు. సర్వేను పరిశీలించి మాట్లాడారు. ఎంపీడీఓ రామారావు, ఎంపీఓ రజని ఉన్నారు.
కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్
Comments
Please login to add a commentAdd a comment