మహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 19న నూతన ఉపాధ్యాయులకు టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహిస్తామని ఆ సంఘం రాష్ట్రకార్యదర్శి సిద్దోజు కవిత అన్నారు. జిల్లా కేంద్రంలోని టీపీటీఎఫ్ కార్యాలయ ప్రాంగణంలో గురువారం అవగాహన సదస్సు కరపత్రాలను నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. అవగాహన సదస్సును నూతన ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రమేశ్, రాష్ట్ర మాజీ కార్యదర్శి మైస నాగయ్య, జిల్లా బాధ్యులు శ్రీశైలం, శ్రీనివాస్, ఉపేందర్, రాజు, అంజయ్య, సదయ్య, కార్తీక్, మురళి, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment