రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి
మహబూబాబాద్ అర్బన్: వాహనదారులు, ప్రజలు బాధ్యతాయుతంగా రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలు పాటించాలని జిల్లా రవాణాశాఖ అధికారి జైపాల్‌రెడ్డి అన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవా ల్లో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని మూ డుకొట్ల సెంటర్‌లో జిల్లా రోడ్డు రవాణాశాఖ అధి కారులు వాహనదారులకు గూలబీపూలు అందజేసి రోడ్డు భద్రత, జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని, తల్లిదండ్రులు పిల్లలకు అర్థమయ్యే రీతిలో చెప్పాలన్నారు. ఈ నెల 31వ తేదీ వరకు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో సీఐ సర్వయ్య, మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్లు ఎం.సాయిచరణ్, వెంకట్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా రవాణాశాఖ అధికారి జైపాల్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment