డయాలసిస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
నెహ్రూసెంటర్: డయాలసిస్ సేవలను సద్విని యోగం చేసుకోవాలని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. మానుకోటలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మంజూరైన అదనపు డయాలసిస్ బెడ్లతో పాటు ఎన్‌సీడీ సెంటర్, ఫ్రీజర్లను ఎమ్మెల్యే మురళీనాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు గురువారం ప్రారంభించారు. అనంతరం ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి ప్రజలు డయాలసిస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూ చించారు. వైద్యులు ఆస్పత్రికి వచ్చే రోగులతో మ ర్యాదగా వ్యవహరిస్తూ వైద్య సేవలు అందించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో సరైన వైద్యం అందడం లేదని, రాత్రి వేళల్లో వైద్యులు ఉండడం లేదని తనకు ఫోన్లు వస్తున్నాయని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. సరిగా పని చేయని వైద్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్‌రెడ్డి, వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, డీఎంహెచ్‌ఓ మురళీధర్, ఆర్‌ఎంఓ జగదీశ్వర్, కేసముద్రం మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్
Comments
Please login to add a commentAdd a comment