![- - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/7/students1_mr.jpg.webp?itok=wYiHCpwb)
సాక్షి, మహబూబాబాద్: ప్రభుత్వం కల్పించిన డిప్యూటేషన్ల వెసులుబాటు కొందరు ఉపాధ్యాయులు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత ఏడాది విద్యార్థులు లేని పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులతోపాటు, హైస్కూల్స్‌లో సబ్జెక్టు టీచర్లు కొరత పేరుతో వేరే పాఠశాలలకు వెళ్లిన వారితోపాటు కొత్తవారు తమకు డిప్యూటేషన్ అవకాశం కోసం ప్రజాప్రతినిధులు,ఉపాధ్యాయ సంఘాల నాయకులతో పైరవీలు ముమ్మరం చేసినట్లు తెలిసింది.పాఠశాలలు మూసి వేయొద్దు. పిల్ల లను ప్రభుత్వ పాఠశాలలకు రప్పించే బాధ్యత ఉ పాధ్యాయులదే..అని కలెక్టర్ శశాంక పదేపదే చె బు తున్నా.. డిప్యూటేషన్లకు అలవాటైన కొందరు ఉ పాధ్యాయులు విద్యార్థులు వచ్చే అవకాశం ఉన్నా ప ట్టింపు లేకుండా పైరవీలు చేస్తుండడం గమనార్హం.
రోడ్డు, రైలు మార్గాలున్న స్కూల్స్‌కు డిమాండ్
జిల్లాలోని పాఠశాలల్లో అత్యధికంగా గిరిజన ఏజెన్సీ, తండాల్లో ఉన్నాయి. వీటిల్లో పనిచేసే కొందరు వరంగల్, ఖమ్మం ప్రాంతాల నుంచి వచ్చి వెళ్తూ ఉంటారు.
దీంతో బస్సు, ట్రైన్ సౌకర్యం ఉన్న పాఠశాలల్లో పనిచేయడానికే ఉపాధ్యాయులు ఎక్కువగా ఆసక్తి చూపుతుండడం గమనార్హం. ప్రధానంగా జిల్లాలోని మారుమూల తండాలు, గ్రామాలో అత్యధికంగా విద్యార్థులు లేని పాఠశాలలు ఉన్నాయి. అక్కడికి విద్యార్థులు వస్తే అక్కడే పనిచేయాల్సి ఉంటుంది. అలా కాకుండా విద్యార్థులు లేకుంటే అక్కడి నుంచి రోడ్డు, రైలు మార్గానికి దగ్గరలో ఉన్న పాఠశాలలకు డిప్యూటేషన్‌పై వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా తక్కువ పిల్లలు ఉన్న పాఠశాలల్లో పనిచేసే టీచర్లను ఉపాధ్యాయుల కొరత ఉన్న హైస్కూల్స్‌కు వేయాలని అధికారులు ఆదేశించారు. అయితే కొందరు యూపీఎస్‌లో పనిచేసేవారు హైస్కూల్‌కు వెళ్లకుండా ఉండేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు అర్జీలు పెట్టుకుంటున్నట్లు సమాచారం. అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాల నాయకుల ద్వారా కూడా డిప్యూటేషన్లపై ప్రయత్నాలు ముమ్మరం చేశారని, ఇటీవల నిర్వహించిన కో–ఆర్డినేషన్ మీటింగ్‌లో కొందరు కాంప్లెక్స్ హెచ్‌ఎంలు తమకు అనుకూలమైనవారికి అనువైన చోటుకు పంపడం, యూపీఎస్ నుంచి హైస్కూల్‌కు పంపకుండా ఉండేవారి జాబితా తయారు చేసినట్లు ప్రచారం. ఇందుకోసం సాయంత్రం అయితే దావత్‌లు, పైరవీల జోరు అందుకుందని ఉపాధ్యాయ వర్గాలు ముచ్చటించుకోవడం గమనార్హం. అయితే ఈ ప్రయత్నంలో పట్టణాలకు దగ్గరగా ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉండాల్సిన సంఖ్య కన్నా ఎక్కువగా ఉండటం.. మారుమూల ప్రాంతాలు, తండాలు, గిరిజన ఆవాస ప్రాంతాల్లో తక్కువ మంది ఉపాధ్యాయులు ఉండే పరిస్థితి నెలకొంది.
జిల్లాలో జోరుగా ఉపాధ్యాయుల పైరవీలు
అనువైన చోటుకోసం ప్రయత్నాలు
పట్టణ పాఠశాలలపై ఆసక్తి
సర్దుబాటు.. దిద్దుబాటు
ఉపాధ్యాయ పోస్టులు ఇప్పట్లో భర్తీ అయ్యే అవకాశం లేకపోడంతో మిగులు ఉపాధ్యాయులను ఉపాధ్యాయులు లేని పాఠశాలల్లో సర్దుబాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో 898 ప్రభుత్వ పాఠశాలలకు 3,690 టీచర్ పోస్టులు ఉండగా.. 3,114 మంది పనిచేస్తున్నారు. 153 పాఠశాలల్లో విద్యార్థులు లేరనే నెపంతో 170 మందికి పైగా ఉపాధ్యాయులు వేరే పాఠశాలకు వెళ్లాల్సి ఉంటుంది. వీరితోపాటు హైస్కూల్స్‌ల్లో సబ్జెక్ట్ టీచర్ల కొరత ఉన్న స్కూల్స్‌లో ఉపాధ్యాయులను డిప్యూటేషన్ వేస్తేనే పాఠశాలలు నడిచే పరిస్థితి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment