బాల్యానికి ‘బంధం’
పెరుగుతున్న బాల్య వివాహాలు
● 2023లో 106.. ఈ ఏడాది ఏకంగా 140
● అధికారులు ఆపినవి ఇవే అయితే అనధికారికంగా ఎన్నో
● ఏటికేడు పెరుగుతుండడంతో అధికారుల్లో ఆందోళన
● తల్లిదండ్రుల్లో మార్పుతోనే అరికట్టే అవకాశం
నవంబర్ 19న వరంగల్ జిల్లా దుగ్గొండి మండల పరిధిలోని ఓ గ్రామంలో 16 ఏళ్ల అమ్మాయి, 25 ఏళ్ల అబ్బాయికి వివాహం అవుతున్నట్లు ఫోన్ రావడంతో జిల్లా బాలల సంరక్షణ అధికారులు వెళ్లి పెళ్లి ఆపారు. తర్వాత అమ్మాయిని సీడబ్ల్యూసీ ఎదుట హాజరుపరిచి నర్సంపేటలోని ఆశ్రమ పాఠశాలకు తరలించారు. అక్కడ రెండు రోజులున్న తర్వాత అమ్మాయిని తల్లిదండ్రులు తీసుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment