కేసముద్రం: నూతన డైట్ మెనూ, విద్య, వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పీహెచ్‌సీ, కల్వల మోడల్‌స్కూల్, బాలికల వసతి గృహం, కేసముద్రంస్టేషన్ జెడ్పీహైస్కూల్, పెనుగొండ, బోడమంచ్యాతండాల్లో ఇందిరమ్మ ఇళ్ల సర్వేను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేసముద్రం పీహెచ్‌సీలో మందుల స్టాక్, రోగుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పీహెచ్‌సీ పరిధిలో ప్రతీరోజు షెడ్యూల్ ప్రకారం వైద్య పరీక్షలు, శిబిరాలు నిర్వహించి మందులు పంపిణీ చేయాలన్నారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని, వైద్య సిబ్బంది సకాలంలో ఆస్పత్రికి రావా లని ఆదేశించారు. అదేవిధంగా మోడల్‌స్కూల్, వసతిగృహం, కేసముద్రంస్టేషన్ జెడ్పీ హైస్కూల్‌లో మధ్యాహ్న భోజనాన్ని ఆయన పరిశీలించారు. పిల ్ల లకు నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని అందించాలన్నారు. విద్యార్థులు చదువుపై ఆసక్తి చూపుతూ ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన డైట్ మెనూ ప్రకారం నాణ్య మైన భోజనాన్ని అందించాలని, విద్య, శానిటేషన్, వైద్యం విషయంలో నిర్లక్ష్యం వహించొద్దన్నారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో డీఈఓ రవీందర్‌రెడ్డి, తహసీల్దార్ దామోదర్, ఎంపీడీఓ క్రాంతి, మార్కెట్ చైర్మన్ సంజీవరెడ్డి ఉన్నారు.
కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్
Comments
Please login to add a commentAdd a comment