కాటారం: మహాముత్తారం మండలం కొర్లకుంటలో 2018లో చోటుచేసుకున్న హత్యాయత్నం కేసులో అదే గ్రామానికి చెందిన నిందితుడు మేడిపల్లి నరేశ్‌కు జైలు శిక్ష విధిస్తూ భూపాలపల్లి జిల్లా కోర్టు అసిస్టెంట్ సెషన్ జడ్జి జయరామిరెడ్డి శుక్రవారం తీర్పు వెల్లడించినట్లు ఎస్సై మహేందర్‌కుమార్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం కొర్లకుంటకు చెందిన కాల్వ రాజేశ్ అదే గ్రామానికి చెందిన మేడిపల్లి నరేశ్‌పై 2018లో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో హత్యాయత్నం ఫిర్యాదు చేశాడు. అప్పటి ఎస్సై రాజు నరేశ్‌పై కేసు నమోదు చేయగా కోర్టులో కొనసాగుతుంది. ఇదే క్రమంలో శుక్రవారం కేసు ట్రయల్‌కు రాగా అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రఫి ఆధ్వర్యంలో ఎస్సై మహేందర్‌కుమార్, కోర్టు లైసింగ్ ఆఫీసర్ వెంకన్న, కోర్టు పీసీ సంపత్‌రెడ్డి సాక్షులను కోర్టు ఎదుట ప్రవేశపెట్టారు. దీంతో నేర నిరూపణ కావడంతో జడ్జి.. నిందితుడు నరేశ్‌కు రెండేళ్ల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమాన విధిస్తూ తీర్పు వెల్లడించారు. ట్రయల్‌ను విజయవంతం చేసిన ఎస్సై, సిబ్బందిని కాటారం డీఎస్పీ గడ్డం రామ్మోహన్‌రెడ్డి, సీఐ నాగార్జునరావు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment