‘నిఫ్ట్’లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
నయీంనగర్ : నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్)–2025 ప్రవేశాలకు ఆన్‌లైన్ నిఫ్ట్ వెబ్‌సైట్‌లో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని డాక్టర్ ప్రొఫెసర్ చక్రపాణి, డాక్టర్ ప్రొఫెసర్ శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో వారు అడ్మిషన్ క్యాలెండర్ ఆవిష్కరించి మాట్లాడారు. ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ నిఫ్ట్‌లో జూలై–2025 గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులలో ప్రవేశాలు పొందేందుకు అభ్యర్థులు www.nif-t.ac.in /admirrion లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో ఫ్యాషన్ డిజైన్, టెక్స్‌టైల్ డిజైన్, యా క్సెసరీ డిజైన్, నిట్‌వేర్ డిజైన్, లెథర్ డిజైన్, ఫ్యాషన్ కమ్యూనికేషన్, ఫ్యాషన్ టెక్నాలజీ–10+2 ఏదైనా స్ట్రీం విద్యార్థులు గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు జనవరి 6వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 040 23112628, 94412 36043 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో నరేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment