భర్త చేతిలో భార్య హతం
మడికొండ: కట్టుకున్న భర్తే కాలయముడై ఉరి వేసి చంపిన ఘటన కాజీపేట మండలం అమ్మవారిపేట గ్రామంలో చోటు చేసుకుంది. మడికొండ ఇన్‌స్పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. కాజీపేట మండలం అమ్మవారిపేట గ్రామానికి చెందిన మైదం కొంరయ్య కొద్ది రోజులుగా పని చేయకపోగా తాగుడుకు బానిసై భార్య మైదం సంతోష(55), కుమారుడు రాజేశ్‌తో గొడవ పడుతూ చంపుతానని బెదించేవాడు. ఈక్రమంలో గ్రామంలో కుల పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. పంచాయితీలో పెద్దమనుషులు కుటుంబ సభ్యులు, కొంరయ్యను మందలించి పంపించారు. ఈక్రమంలో గురువారం ఇంట్లో ఉన్న సంతోషతో గొడవ పడి తాడుతో గొంతుకు బిగించి హత్య చేశాడు. కోడలు చూసి కేకలు వేయడంతో కొంరయ్య పారిపోయాడు. శుక్రవారం కుమారుడు రాజేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ కిషన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment