విద్యారణ్యపురి: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ జన్మదినం సందర్భంగా నవీన్ లిటరరీ ట్రస్టు ఆధ్వర్యాన ఈనెల 24న సాయంత్రం 5.30 గంటలకు హనుమకొండ వాగ్దేవి కళాశాల ఆడిటోరియంలో అంపశయ్య నవీన్ గ్రంథాలను ఆవిష్కరించనున్నారు. అలాగే ప్రథమ నవలా పురస్కారాలు కూడా అందజేయనున్నట్లు అంపశయ్య నవీన్ ట్రస్టు సెక్రటరీ డి.స్వప్న శుక్రవారం తెలిపారు. ‘ప్రేమకు ఆవలి తీరం’ నవలకు ఇంగ్లిష్ అనువాదం(బియాండ్ ది షోర్‌ఆఫ్ లవ్) గ్రంథాన్ని ప్రొఫెసర్ మిట్టపెల్లి రాజేశ్వర్, కర్రె సదాశివ్ రచించిన అంపశయ్యనవీన్ కథలు–ఒక పరిశీలన గ్రంథాన్ని జి.గిరిజామనోహర్‌బాబు ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment