పెండింగ్ పనులు పూర్తి చేస్తాం..
మహబూబాబాద్: మానుకోట మున్సిపాలిటీలో పెండింగ్ పనులు పూర్తి చేయిస్తామని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ స మావేశం నిర్వహించారు. కాగా సమావేశం వాడీవేడిగా జరిగింది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య మాటల యుద్ధం జరుగగా.. చైర్మన్‌కు సీపీఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మధ్య, కమిషనర్‌తో పలువురు కౌన్సి లర్లు పారిశుద్ధ్యం, శానిటరీ ఇన్‌స్పెక్టర్ విషయంలో తీవ్ర వాగ్వాదం చేశారు.
ప్రారంభంలోనే..
సమావేశం ప్రారంభంలోనే సీపీఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అజయ్‌సారథిరెడ్డి మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్‌రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మూడుకొట్ల జంక్షన్ ఎందుకు అభివృద్ధి చేయలేదని, మోడల్ మార్కెట్‌కు జనరల్‌ఫండ్ నుంచి రూ.కోటి ఎందుకు ఖర్చు చేశారని, మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.50 కోట్లు ఎందుకు తీసుకురాలేకపోయారని అజయ్‌సారథి ప్రశ్నించారు. ఈ క్రమంలో చైర్మన్‌తో వాగ్వాదం చేశారు.
అంచనాలు లేకుండానే..
సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీనాయక్ హాజరై మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో మానుకోట మున్సిపాలిటీలో బడ్జెట్ అంచనాలు లేకుండా అవగాహన రాహిత్యంతో పనులు చేయడం వల్లే మధ్యలోనే నిలిచిపోయాయన్నారు. మెడికల్‌కాలేజీ పనులు 25శాతం కూడా పూర్తికాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. హంగులకు పోయి మోడల్ మార్కెట్‌ను పూర్తి చేయలేదని, మిగిలిన పనుల కోసం రూ.95 లక్షలు మంజూరు చేయించి పూర్తి చేయిస్తానన్నారు. మూడుకొట్ల జంక్షన్‌కు కూడా రూ. 15 లక్షలు కేటాయిస్తామని, ఆపనులు కూడా పూర్తి చేయిస్తానన్నారు. అర్హులైన పేదలందరికీ ఇందరిమ్మ ఇళ్లు మంజూరు అవుతాయన్నారు. జమాండ్లపల్లిలో శ్మశాన వాటిక కోసం ఎకరంన్నర భూమి కేటాయించినట్లు చెప్పారు. గత ప్రభుత్వం మున్సిపల్ చట్టాన్ని నిర్వీర్యం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అన్నారు. గత ప్రభుత్వం వల్ల బిల్లులు రాక కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మిషన్ భగీరథ పనుల కోసం రూ.20 కోట్లు విడుదల అయ్యాయన్నారు. గత ప్రభుత్వం ఖాజానా ఖాళీ చేసిందన్నారు.
శివారు కాలనీల్లో సమస్యలు పరిష్కరించాలి..
మానుకోట పట్టణ శివారు కాలనీల్లో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు అన్నారు. అభివృద్ధి పనులకు అన్ని విధాలా సహకారం అందిస్తానన్నారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకం కాదని, అభివృద్ధి పనులకు నిధుల విడుదల కోసం వాదిస్తున్నామన్నారు. మున్సిపల్ భవనానికి కేటాయించిన స్థలం కూడా కబ్జా చేస్తున్నారని, వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. కౌన్సిల్ సాధారణ సమావేశాలకు తప్పనిసరిగా అదికారులు హాజరు కావాలి.. కాని రావడం లేదన్నారు.
అభివృద్ధి పనులు చేశాం..
మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతీవార్డుకు రూ.5లక్షలు కేటాయిస్తామన్నారు. ఐదు సంవత్సరాల్లో కోట్ల రూపాయల అభివృద్ధి జరిగిందన్నారు. పాలక మండలి పదవీకాలంలోపే మున్సిపాలిటీ భవనం పూర్తి చేయాలని, మోడల్ మార్కెట్ పనులు కూడా పూర్తి చేయించి ప్రారంభోత్సవం చేయాలని ఎమ్మెల్యేను కోరారు.
కౌన్సిలర్లు ఏం మాట్లాడారంటే..
సీపీఎం మున్సిపల్‌ఫ్లోర్ లీడర్ సూర్నపు సోమయ్య మాట్లాడుతూ.. పత్తిపాక రోడ్డులో బాబునాయక్ తండా క్రాస్ వరకు మాత్రమే సెంట్రల్ లైటింగ్, డివైడర్లు ఏర్పాటు చేయడం సరికాదని, మంగళికాలనీ వరకు ఏర్పాటు చేయాలన్నారు.
కౌన్సిలర్ ఎడ్ల వేణుమాధవ్ మాట్లాడుతూ.. పాలకమండలి గడువులోపే మున్సిపాలిటీ భవనం పూర్తి చేయాలన్నారు.
కౌన్సిలర్ బుజ్జి వెంకన్న మాట్లాడుతూ.. నిజాం చెరువు నుంచి వచ్చే వరదనీరు రాబందువు చెరువులో కలిసే విధంగా పనులు చేపట్టాలన్నారు.
కౌన్సిలర్ నీరజారెడ్డిధర్మన్న మాట్లాడుతూ.. 36వ వార్డు పరిధి ఏ క్యాబిన్ సమీపంలో రైల్వే లైన్ పనులు నడుస్తున్నందున రోడ్డు మూసి వేశారని, ప్రత్యామ్నాయ రోడ్డు వేశారని, దానిపై సీసీ రోడ్డు నిర్మాణం చేయాలన్నారు.
కౌన్సిలర్లు హరిసింగ్, వెన్నం లక్ష్మారెడ్డి, భూక్య శ్రీను మాట్లాడుతూ.. విలీన గ్రామా ల్లోని సమస్యలు పరిష్కరించాలన్నారు. సిబ్బ ంది సంఖ్య పెంచాలని, అధికంగా నిధులు కేటాయించాలన్నారు.
కౌన్సిలర్ విజయమ్మ మాట్లాడుతూ.. తన వార్డు పరిధిలో పారిశుద్ధ్య సమస్యతో పాటు నీటి సమస్య పరిష్కరించాలన్నారు.
గత సర్కారు నిర్వాహకంతో పనులు నిలిచిపోయాయి
ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్
వాడీవేడిగా మానుకోట మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం
కమిషనర్‌తో వాగ్వాదం..
కమిషనర్ నోముల రవీందర్‌తో కౌన్సిలర్లు హరిసింగ్‌తో పాటు భూక్య శ్రీను వాగ్వాదం చేశారు. తమ వార్డులకు ఒక్కసారి కూడా కమిషనర్ రాలేదని, శానిటేషన్‌ను పట్టించుకో లేదని పలు సమస్యలపై నిలదీశారు. కౌన్సిలర్ బుజ్జి వెంకన్న కల్పించుకొని తన వార్డు సిబ్బందిని వేరే పనులకు పంపుతున్నారని కమిషనర్‌ను నిలదీశారు. సీపీఎం మున్సిపల్‌ఫ్లోర్ లీడర్ సూర్నపు సోమయ్య కూడా శానిటరీ ఇన్‌స్పెక్టర్ వ్యవహారంలో కమిషనర్‌తో గొడవ పడ్డారు. కాంట్రాక్ట్ వర్కర్లు ఏలేంద్ర, సుజాత, మంజులతో పాటు మరికొందరు శానిటరీ ఇన్‌స్పెక్టర్ రాజేశ్ ఇబ్బంది పెడుతున్నారని, అతనిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్, చైర్మన్‌కు వినతిపత్రంఇచ్చారు. పలు సంఘాల నాయకులు కూడా పలు సమస్యలపై వినతులు అందజేశారు. కాగా ఎజెండాలోని 187 ప్రతిపాదనలపై చర్చించి తీర్మానం చేసినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, డీఈ ఉపేందర్, ఫ్లోర్‌లీడర్లు వెన్నం లక్ష్మారెడ్డి, చిట్యాల జనార్దన్, విద్యుత్‌శాఖ డీఈ విజయ్‌కుమార్, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment