కేసముద్రం మున్సిపాలిటీగా గెజిట్ విడుదల
కేసముద్రం: కేసముద్రం మున్సిపాలిటీ ఏర్పాటుకు ఆమోదాన్ని తెలుపుతూ రాష్ట ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. దీంతో ఈప్రాంతవాసుల ఆకాంక్ష నెరవేరినట్లైంది. కేసముద్రం మున్సిపాలిటీ ఏర్పా టు కోసం కేసముద్రంస్టేషన్, కేసముద్రంవిలేజ్, ధన్నసరి, సబ్‌స్టేషన్ తండా జీపీ, అమీనాపురం గ్రామాల్లో ఇటీవల అధికారులు నిర్వహించిన గ్రామసభల్లో ఏకగ్రీవంగా తీర్మానించిన విషయం తెలిసిందే. నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించగా, అసెంబ్లీ సమావేశంలో రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు రాష్ట్రంలో కొత్తగా 12 మున్సిపాలిటీలను ఏ ర్పాటు చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఇందులో భాగంగా కేసముద్రాన్ని మున్సిపాలిటీగా ప్రతి పాదిస్తూ అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే 12 మున్సిపాలిటీలకు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఇందులో భాగంగా కేసముద్రం మున్సిపాలిటీ ఏర్పాటుకు ఆమోదముద్ర పడింది. కాగా కొత్తగా ఏర్పా టు కానున్న కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 19,438 మంది జనాభా ఉన్నారు. త్వరలో మున్సిపాలిటీల పరిధిలోని ఓటర్ల జాబితాకు అనుగుణంగా వార్డుల విభజన, రిజర్వేషన్ల కేటాయింపు ఉంటుందని అధికారులు తెలిపారు.
నెరవేరిన ఈప్రాంతవాసుల చిరకాల ఆకాంక్ష
Comments
Please login to add a commentAdd a comment