అతివేగంతో ప్రాణాపాయం
మహబూబాబాద్ రూరల్: అతివేగంగా వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అతివేగంతో వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు గురై కుటుంబాలకు తీరని దుఃఖాన్ని మిగిల్చుతున్నారని పేర్కొన్నారు. రోడ్డు నిబంధనలపై ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా వాహనదారులు కొద్దిరోజులు మాత్రమే అనుసరిస్తూ మళ్లీ యథావిధిగా ప్రవర్తిస్తున్నారన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా రవాణా, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అజాగ్రత్తగా వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు గురై మరణించిన వారిలో హెల్మెట్ లేకుండా, సీట్ బెల్టు లేకుండా, పరిమితికి మించి వేగంగా వాహనాలు నడిపి ప్రమాదాలకు గురైన వారే అధికంగా ఉన్నారన్నారు. చట్టాలను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనదారులు జాగ్రత్తలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చన్నారు. డ్రంకెన్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్ వల్ల ప్రమాదాల ప్రాణనష్టం ఎక్కువ జరిగే ఆస్కారం ఉంటుందన్నారు.
ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్
Comments
Please login to add a commentAdd a comment