అర్హులందరికీ సంక్షేమ పథకాలు
గూడూరు: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడానికి అధికార యంత్రాంగం క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహిస్తోందని కలెక్టర్ అద్వైత్ కుమార్‌సింగ్ అన్నారు. మండలంలోని నక్కబండ, రామరవంచ గ్రామ పంచాయతీల్లో జరుగుతున్న ప్రభుత్వ పథకాల విచారణ సర్వేను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 26 నుంచి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న 4 సంక్షేమ పథకాల క్షేత్రస్థాయి సర్వే ప్రక్రియ పారదర్శకంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సర్వేకు ప్రజలు సహకరించాలని కోరారు. వ్యవసాయ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సర్వేలో పాల్గొని వ్యవసాయానికి అనువుగా లేని భేములు, నాలాలకు కన్వర్ట్ అయిన భూములు, రియల్ ఎస్టేట్ భూములు, మైనింగ్ చేస్తున్న భూములతో పాటు తదితర భూములను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా నమోదు చేయాలన్నారు. 16 నుంచి 20 వరకు సర్వే జరుగుతుందని, 21 నుంచి 24వరకు గ్రామ సభలు నిర్వహించి అర్హుల జాబితాను సిద్ధం చేయనున్నట్లు తెలిపారు.
కలెక్టర్ అద్వైత్ కుమార్‌సింగ్
Comments
Please login to add a commentAdd a comment