కొర్రీలు పెట్టడమే బీఆర్‌ఎస్ నాయకుల పని
కొత్తగూడ: ప్రభుత్వ పథకాలు అమలు కాకుండా కొర్రీలు పెట్టడమే బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు పని గా పెట్టుకున్నారని పంచాయతీరాజ్, సీ్త్ర, శిశు సంక్షే మ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మండలకేంద్రంలోని రైతువేదికలో జరిగిన ముఖ్య కార్యకర్తల స మావేశంలో ఆమె మాట్లాడారు. అధికారం పోయిందనే అక్కసుతో బీఆర్‌ఎస్ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఎద్దేవాచేశారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలో సాహసోపేత పథకాలను విజయవంతంగా అమలు చేసినట్లు తెలిపారు. గణతంత్ర దినోత్సవం నుంచి రైతు భరోసా, ఏడాదికి రూ.12వేల చొప్పున రైతులకు ఇవ్వబోతున్నామని అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కోటీశ్వరులకే రైతు బంధు దక్కిందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేసేలా కార్యకర్తలు పని చేయాలని అన్నారు. గోవిందాపురం గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు బ్రహ్మచారి మంత్రి సీతక్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం మండలకేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి సీతక్క భూమి పూజ చేశారు. మల్లెల రామయ్య అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
Comments
Please login to add a commentAdd a comment