గ్రూప్–2 పరీక్షలు ప్రారంభం
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్)/ మహబూబ్‌నగర్ క్రైం: జిల్లాలో గ్రూప్–2 పరీక్ష ఆదివారం మొదటిరోజు ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 54 కేంద్రాలు ఏర్పాటు చేయగా 20,584 మంది అభ్య ర్థులు హాజరు కావాల్సి ఉంది. అయితే ఉదయం తొలి పేపర్‌కు 10,380 హాజరు కాగా.. 10,204 గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం రెండో పేపర్‌కు 10,314 హాజరు కాగా.. 10,270 మంది గైర్హాజరయ్యారు. ఉదయం 8.30 గంటల నుంచి అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతించిన అధికారులు 9.30 గంటలకు గేట్లు మూసి వేశారు. పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లను అధికారులు చేపట్టడంతో ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల, బాలిక జూనియర్ కళాశాలల పరీక్ష కేంద్రాలకు 9.30 గంటల తర్వాత వచ్చిన నలుగురు అభ్యర్థులను అధికారులు అనుమతించకపోవడంతో వారు నిరాశగా వెనుదిరిగారు. ఉదయం 10 నుంచి మ ధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్–1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీ, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ –2లో హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ పరీక్ష జరిగింది. పరీక్షలో భాగంగా రెండోరోజు సోమవారం పేపర్–3లో ఎకనామిక్స్ అండ్ డెవలప్ మెంట్, మధ్యాహ్నం పేపర్–3లో తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు అంశంపై పరీక్ష జరగనుంది.
పటిష్ట బందోబస్తు
రూరల్ పరిధిలోని జేపీఎన్‌సీఈ కళాశాలలోని పరీక్ష కేంద్రాన్ని జోగుళాంబ జోన్– 7 డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్, ఎస్పీ జానకి కలిసి సందర్శించి.. బందోబస్తు ఏర్పాట్లతోపాటు అభ్యర్థులను పరిశీలించారు. ఈ క్రమంలో ఓ గర్భిణి పరీక్ష రాయడానికి రాగా.. డీఐజీ జేపీఎన్‌సీఈ రోడ్డు నుంచి కళాశాల వరకు కారులో పంపించారు. అనంతరం డీఐజీ మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల వద్ద భద్రత కట్టుదిట్టంగా అమలు చేశామని, అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. అలాగే ట్రాఫిక్ సమస్య లేకుండా నియంత్రించామని, అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి చొరవ చూపామని వివరించారు. ప్రతి కేంద్రం దగ్గర ప్రతి కేంద్రం దగ్గర ముగ్గురు సిబ్బందితో భద్రత కల్పించగా మిగిలిన అధికారులు పెట్రోలింగ్ చేస్తూ అన్ని కేంద్రాలను పర్యవేక్షించారన్నారు. పోలీసులు విస్తృతంగా ఏర్పాటు చేసి.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూశామన్నారు. అలాగే ఎస్పీ జానకి, డీఎస్పీ వెంకటేశ్వర్లు ఎన్టీఆర్, ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలు, పాలమూరు యూనివర్సిటీ కేంద్రాలను తనిఖీ చేశారు. ఆయా తనిఖీల్లో రూరల్ సీఐ గాంధీనాయక్, ఎస్‌ఐ విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
పొరపాట్లకు తావులేకుండా..
టీజీపీఎస్సీ గ్రూప్–2 పరీక్షలను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సజావుగా నిర్వహించాలని కలెక్టర్ విజయేందిర అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆమె ఉదయం దేవరకద్ర మండలం చౌదర్‌పల్లిలోని స్విట్స్ ఇంజినీరింగ్ కళాశాల, జిల్లాకేంద్రంలోని సంస్కార్, బ్రైట్, గ్రామర్ స్కూళ్లు, మధ్యాహ్నం స్థానిక తెలంగాణ చౌరస్తాలోని తక్షశిల, రెయిన్ బ్రో, ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలల్లోని కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి పరీక్ష తీరును పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. పరీక్ష ముగిసిన తర్వాత జవాబు పత్రాలను జాగ్రత్తగా భద్రపరచాలని సూచించారు.
9.30 గంటలకేమూసుకున్నకేంద్రాల గేట్లు
ఆలస్యంగా వచ్చిన నలుగురు అభ్యర్థులకు అనుమతి నిరాకరణ
పరీక్షలను పర్యవేక్షించిన కలెక్టర్, డీఐజీ, ఎస్పీలు
Comments
Please login to add a commentAdd a comment