నేటినుంచి సీఎం కప్‌ సందడి | - | Sakshi
Sakshi News home page

నేటినుంచి సీఎం కప్‌ సందడి

Published Mon, Dec 16 2024 1:42 AM | Last Updated on Mon, Dec 16 2024 1:42 AM

నేటినుంచి సీఎం కప్‌ సందడి

నేటినుంచి సీఎం కప్‌ సందడి

మహబూబ్‌నగర్‌ క్రీడలు: రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్‌– 2024 క్రీడాపోటీలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. గ్రామీణ క్రీడా నైపుణ్యాలను వెలికితీయడమే లక్ష్యంగా సీఎం కప్‌ క్రీడా పోటీలు జరుగుతున్నాయి. ఈ నెల 7, 8 తేదీల్లో గ్రామం, 10 నుంచి 12 వరకు మండల స్థాయిలో క్రీడా పోటీలను నిర్వహించారు. ఆయా పోటీల్లో వేలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

4,500 మంది క్రీడాకారులు

సీఎం కప్‌లో భాగంగా జిల్లాకేంద్రంలోని మెయిన్‌ స్టేడియంలో సోమవారం నుంచి ఈ నెల 20 వరకు జిల్లాస్థాయి క్రీడా పోటీలతోపాటు సెలక్షన్స్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా యువజన, క్రీడలశాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాస్థాయిలో దాదాపు 4,500 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.

● సోమవారం వాలీబాల్‌, కబడ్డీ, ఖోఖో, బాస్కెట్‌బాల్‌, కిక్‌బాక్సింగ్‌తోపాటు నెట్‌బాల్‌, బేస్‌బాల్‌, సాఫ్ట్‌బాల్‌ పోటీలు ఫైనల్‌ వరకు నిర్వహించనున్నారు.

● మంగళవారం హాకీ, స్విమ్మింగ్‌, రెజ్లింగ్‌, సైక్లింగ్‌, వుషూ, జూడో, హ్యాండ్‌బాల్‌, అత్యపత్య, వెయిట్‌ లిఫ్టింగ్‌, పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలు ఉంటాయి.

● బుధవారం ఆర్చరీ, టేబుల్‌ టెన్నిస్‌, లాన్‌టెన్నిస్‌, ఫుట్‌బాల్‌, జిమ్నాస్టిక్‌, షూటింగ్‌, సెపక్‌తక్రా, కరాటే, రోయింగ్‌, స్క్వాష్‌, కనోయింగ్‌– కయాకింగ్‌, తైక్వాండో నిర్వహిస్తారు.

● గురువారం అథ్లెటిక్స్‌, బ్యాడ్మింటన్‌, యోగా, చెస్‌ బాక్సింగ్‌తోపాటు వాలీబాల్‌, కబడ్డీ, ఖోఖో, బాస్కెట్‌బాల్‌ ఫైనల్‌, క్రీడల్లో గెలుపొందిన వారికి బహమతులు అందజేయనున్నారు. జిల్లాస్థాయి సీఎం కప్‌ క్రీడల్లో ప్రతిభకనబరిచిన వారు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు.

● శుక్రవారం స్థానిక మెయిన్‌ స్టేడియంలో హ్యాండ్‌బాల్‌, వాలీబాల్‌ ఉమ్మడి జిల్లా పోటీలు నిర్వహించనున్నారు.

ప్రతిభచాటాలి..

సీఎం కప్‌ జిల్లాస్థాయి క్రీడా పోటీలు, ఎంపికలు సోమవారం నుంచి జరగనున్నాయి. ఈ మేరకు డీవైఎస్‌ఓ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లాస్థాయి క్రీడల నిర్వహణకు ప్రత్యేక కమిటీలు నియమించాం. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భోజన, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నాం. క్రీడాకారులు జిల్లాస్థాయిలో మెరుగైన ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతలుగా నిలవాలి.

– శ్రీనివాస్‌, జిల్లా యువజన,క్రీడల అధికారి

36 క్రీడాంశాల్లో జిల్లాస్థాయి పోటీలు

మెయిన్‌ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి

హాజరుకానున్న వేలాది మంది విద్యార్థులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement