సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి
జడ్చర్ల టౌన్: సమగ్రశిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పర్వత్‌రెడ్డి అన్నారు. ఆదివారం జడ్చర్లలో ఏర్పాటు చేసిన సంఘం ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కొద్దిరోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తీర్చాలన్నారు. గతేడాది సెప్టెంబర్ 13న అప్పటి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి సమగ్ర శిక్ష ఉద్యోగుల దీక్ష శిబిరానికి వచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోగా సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా సమస్యలు తీరడం లేదని ఆరోపించారు. అలాగే కేజీబీవీ కళాశాలల్లో టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బంది కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారని, వారు సమ్మెకు వెళ్తే ఇబ్బందులు తప్పవన్నారు. విద్యారంగంలోని అన్ని విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని, అప్పటి వరకు కనీస వేతనం ఇవ్వాలన్నారు. ఉపాధ్యాయులకు సంబంధించిన పెండింగ్ బిల్లులన్నీ విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శశిధర్, కృష్ణనాయక్, నర్సింహారెడ్డి, జగపతిరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, తాహెర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment