‘పడమటి’కి పోటెత్తారు
భక్తజనసంద్రం మధ్య కదులుతున్న రథం
పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం సాయంత్రం నిర్వహించిన రథోత్సవం కనులపండువగా సాగింది. ముందుగా స్వామివారికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి మేళతాళాలతో తేరుపై కూర్చోబెట్టారు. అనంతరం రథాన్ని బాలాంజనేయస్వామి ఆలయం వరకు లాగారు. రథోత్సవాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాలే కాకుండా కర్ణాటక, హైదరాబాద్, పుణె, సోలాపూర్ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. అంతకు ముందు మంత్రి కొండా సురేఖ ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. – మక్తల్
Comments
Please login to add a commentAdd a comment