మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఎస్సీ వర్గీకరణ అమలుపై వచ్చే నెల 2న స్థానిక అంబేద్కర్ కళాభవన్‌లో మాదిగ, మాదిగేతర మేధావులతో సంఘీభావ సభ ఉంటుందని ఎంఈఎఫ్ జాతీయ నాయకుడు వెంకటస్వామి అన్నారు. మంగళవారం టీఎన్‌జీఓ భవన్‌లో మాదిగ ఉద్యోగుల అత్యవసర సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోజు అందరితో సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు. ఈ సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా అధ్యక్షుడు తగువుల ప్రభాకర్, గాలి యాదయ్య, ఎం.వెంకటేశ్, కావలి కృష్ణయ్య, ఆకేపోగు రాములు, బాలపీర్, బోరెల్లి కొండయ్య, బోయపల్లి ఆంజనేయులు, అనుముల యాదయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment