కొల్లాపూర్ రూరల్: సింగోటం శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉదయం అభిషేక మహోత్సవం, బ్రహ్మోత్సవ సంకల్పం, గణపతి పుణ్యవాహచన, బుత్విక్‌వరణం, అఖండ స్థాపన, నవగ్రహ, అంకురారోహణ, ధ్వజ రోహణ కార్యక్రమాలు చేపట్టారు. సాయంత్రం ఆశ్వవాహనంపై స్వామివారికి ఊరేగింపు నిర్వహించారు. రాత్రి స్వామివారి ఉత్సవమూర్తులను నగ లు, పూలతో ముస్తాబు చేసి ఆలయ సమీపంలో ఉన్న మండలంలో ఆసీనులు చేశారు. వందలాది మంది భక్తుల సమక్షంలో వేదపండితులు స్వామివారి కల్యాణం వైభవంగా నిర్వహించారు.
20 వరకు ఉత్సవాలు
శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రత్యేక పూజలతో మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 20వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. 16న స్వామి వారికి ప్రభోత్సవం ఉండగా.. ప్రధాన ఘట్టం రథోత్సవాన్ని శుక్రవారం (17వ తేదీ)న నిర్వహిస్తారు. ఈ వేడుకను తిలకించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి దాదాపు 50వేల మంది భక్తులు హాజరవుతారు. 18న స్వామి వారికి తెప్పోత్సవం, 20 హంసవాహన సేవ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment