పాన్‌గల్: ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన మండలంలో గురువారం చోటుచేసుకుంది. హెడ్‌కానిస్టేబుల్ చంద్రశేఖర్ తెలిపిన వివరాలు.. మల్లాయి పల్లికి చెందిన వెంకటేశ్వర్‌రెడ్డి(39) హైదరాబాదులో క్యాటరింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సంక్రాంతి సందర్భంగా గ్రామానికి వచ్చాడు. బుధవారం రాత్రి కుటుంబీకులతో కలిసి భోజ నం చేసి నిద్రించారు. గురువారం ఉదయం గదిలో నిద్రించిన అతడు తలుపులు తీయలేదు. వారు వెనుకవైపు నుంచి గదిలోకి వెళ్లిచూడగా ఫ్యాన్‌కు ఉరేసుకొని వేలాడు తూ కనిపించాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment