అమరచింత: మండలంలోని సింగంపేటలో కోడి పందెల వద్ద రెండు వర్గాలు ఘర్షణకు దిగి పరస్పరం దాడులు చేసుకున్న ఘటన బుధవారం చోటుచేసుకుంది. బాధితుల ఫిర్యాదు మేరకు గురువారం గ్రామంలో విచారణ చేపట్టిన పోలీసులు గొడవకు దారి తీసిన పరిస్థిలపై ఆరా తీశారు. బుధవారం గ్రామంలోని ఆలయ సమీపంలో కోడి పందెలు నిర్వహించారు. వీరిలో ఒడిపోయిన కోడి యాజమాని ముందు గెలిచిన కోడి యాజమాని తొడకొట్టి హేళన చేయడంతో ఇద్దరి మధ్య మాటమాట పెరిగి కొట్టుకున్నారు. విషయం తెలిసిన వెంటనే ఇరు కుటుంబ సభ్యులు గ్రూపులుగా ఏర్పడి రాళ్లు రువ్వుకోవడంతో రవి అనే యువకుడి కన్ను భాగంలో రక్తగాయమైంది. విషయాన్ని గతంలో జరిగిన గొడవల కారణంగా మనసులో పెట్టుకుని మళ్లీ గొడవ పడ్డారని, ఇదే విషయాన్ని పోలీసులకు సమాచారం ఇస్తూ ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నట్లు తెలిసింది. జిల్లాలో ఎక్కడ కోడి పందెలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించినా.. ఇక్కడ మాత్రం పోలీస్ స్టేషన్‌కు మూడు కిలోమీటర్ల దూరంలో కోడి పందెలు నిర్వహించడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేశారు. ఘర్షణకు పాల్పడిన ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేష్ తెలిపారు.
ఇరువర్గాలపై కేసు నమోదు
Comments
Please login to add a commentAdd a comment