అచ్చంపేట రూరల్: పోలీసు విధులకు ఆటంకం కలిగించిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై గురువారం అచ్చంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ రమేష్ కథనం ప్రకారం.. బుధవారం రాత్రి అచ్చంపేటలోని భ్రమరాంబదేవి ఆలయం వద్ద ప్రభ ఊరేగింపు సందర్భంగా బందోబస్తులో ఉన్న పోలీసులను గువ్వల బాలరాజు దుర్భాషలాడుతూ విధులకు ఆటంకం కలిగించారన్నారు. దీనిపై వీడియో, ఇతర ఆధారాల ఆధారంగా గువ్వల బాలరాజుపై కేసు నమోదు చేశామని, త్వరలోనే మరికొంత మందిపై కేసు నమోదు చేస్తామని చెప్పారు. పోలీసు విధులకు ఆటంకం కలిగిస్తే ఊపేక్షించేది లేదన్నారు. శాంతిభద్రతలకు అందరూ సహకరించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment