కృష్ణానదిపై రాకపోకలకు అనుమతి నిరాకరణ
పెంట్లవెల్లి: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, నంద్యాల, ఆత్మకూర్ తదితర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు ఏటా సింగోటం లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఇంజన్ బోట్లలో కృష్ణానది దాటి వచ్చే వారు. అయితే ఆంధ్రా పోలీసులు మూడేళ్లుగా బోట్లలో నదిపై ప్రయాణాన్ని నిషేధించారు. ఈ ఏడాది కూడా అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి తిరిగి రద్దు చేయడంతో భక్తులు నిరాశకు గురయ్యారు.
200 కి.మీ. ప్రయాణం..
కృష్ణానదిపై ప్రయాణానికి అనుమతిని నిరాకరించడంతో ఆయా ప్రాంతాల భక్తులు కర్నూలు, పెబ్బేరు, కొల్లాపూర్ మీదుగా సింగోటానికి చేరుకుంటారు. సుమారు 200 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి బ్రహ్మోత్సవాలకు ఏటా హాజరవుతున్నారు. అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని ఇంజన్ బోట్లపై ప్రయాణానికి అనుమతించాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment