పురుగు మందు తాగి వ్యక్తి బలవన్మరణం
కల్వకుర్తి టౌన్: తాను నిత్యం తాగే మందులో పురుగుమందు కలుపుకొని తాగి వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ మాధవరెడ్డి, కుటుంబీకులు తెలిపిన వివరాలు.. పట్టణంలోని సుభాష్‌నగర్ కాలనీలో నివాసముండే మురళీకృష్ణ(46) ప్రైవేట్ సీడ్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తూ తన జీవనాన్ని సాగించేవాడు. అతను తరచూ నెలలో రెండు, మూడు రోజులు అతిగా మద్యం తాగి ఎక్కడపడితే అక్కడ పడిపోయేవాడు. రోజు మాదిరిగానే ఆదివారం రాత్రి ఇంట్లో నుంచి బయలుదేరిన అతను మద్యాన్ని కొనుగోలు చేసి, అందులో తన వద్ద ఉన్న పురుగుమందును కలుపుకొని తాగాడు. ఇంటికి సమీపంలో ఉన్న వేంకటేశ్వరస్వామి దేవాలయం వెనక భాగంలో పడిఉన్నాడు. ఉదయాన్నే అటుగా వెళ్తున్నవారు చూసి కుటుంబసభ్యులకు సమాచారమివ్వగా, వారు వచ్చి చూసేసరికి అప్పటికే మృతిచెందాడు. కుటుంబీకులు పోలీసులకు సమాచరమివ్వగా వారు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని పట్టణంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మృతుడికి భార్యతో పాటు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment