కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
అచ్చంపేట: శ్రీశైలం ఉత్తర ద్వారమైన ఉమామహేశ్వర క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మూడోరోజు సోమవారం అర్చకుడు వీరయ్యశాస్త్రి ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకాలు, వసంతోత్సవం, చక్రస్నానం, పాపనాశనం వద్ద త్రిశూల స్నానాలు, పల్లకీసేవ నిర్వహించారు. భక్తులు పాపనాశిని గుండం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే ఆలయంలో ఉదయం గవ్యంత పూజలు, వాస్తుపూజ, వాస్తుహోమంతో పాటు అమ్మవారికి కుంకుమార్చన చేశారు. వేడుకలను ఆలయ కమిటీ చైర్మన్ బీరం మాధవరెడ్డి, కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరావు పర్యవేక్షిస్తున్నారు. దర్గా వద్ద నుంచి గ్రామపంచాయతీ, ఉమమహేశ్వరం ద్వారం వరకు కాలినడకన భక్తులు తప్పా ఇతర వాహనాలను అనుమతించడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment