మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రంలో 5 కి.మీ. మేర విస్తరించిన జడ్చర్ల–రాయచూర్ ఎన్‌హెచ్–167 (మెయిన్ రోడ్డు)కు ఇరువైపులా ఎక్కడికక్కడ ఫుట్‌పాత్‌లను వ్యాపారాలకు, పార్కింగ్ కోసం ఉపయోగిస్తుండడంతో పాదాచారులకు నడవడానికి దారి లేకుండా పోయింది. 2.5 అడుగుల ఫుట్‌పాత్‌పై చిరువ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా వివిధ వస్తువులు, బోర్డులు ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యకూడళ్లలో ప్రైవేట్ వ్యక్తులు తమ వ్యాపారానికి సంబంధించి భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లు, కటౌట్లు పెడుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. మరోవైపు మున్సిపాలిటీ జనవరి 27 నుంచి కార్పొరేషన్ (నగర పాలక సంస్థ)గా మారింది. ప్రత్యేక అధికారిగా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్ నియమితులయ్యారు. అనంతరం కలెక్టరేట్‌లో స్థానిక కమిషనర్‌తో పాటు టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్, రెవెన్యూ విభాగాల అధికారులతో కలెక్టర్ విజయేందిర సమీక్షించి.. నగరంలో ఫుట్‌పాత్‌లను ఎవరు ఆక్రమించినా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment