క్షయ నిర్ధారణ పరీక్షలు పెంచాలి: కలెక్టర్
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): క్షయవ్యాధి నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచాలని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. మంగళవారం కలెక్టర్ చాంబర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ టీబీ రోగులకు చేయూతనివ్వడం, టీబీపై అవగాహన కల్పించడం, 100 రోజుల (నిక్షయ్ శిబిరం) టీబీని ముందుగా గుర్తించేందుకు అవసరమైన ఎక్స్‌రేలను పెంచాలన్నారు. ఎన్‌టీఈపీ సిబ్బంది వీలైనంత ఎక్కువ మంది ప్రజలకు పరీక్షలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. టీబీ నిర్ధారణ పరీక్షల సంఖ్య జిల్లాలో చాలా తక్కువగా ఉందని రాష్ట్ర కమిషనర్ ద్వారా వచ్చిన లేఖలో ఉందని కలెక్టర్ తెలిపారు. నిక్షయ్ పోర్టల్‌లో సమస్యలు ఉన్నాయని, అందుకే డేటా అప్‌లోడ్ చేయడానికి ఆలస్యమైందని, ఈ సమస్యను పరిష్కరించి, త్వరితగతిన పూర్తి చేస్తామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కృష్ణ వివరణ ఇచ్చారు. సమావేశంలో డాక్టర్లు డీఐఓ పద్మ, భాస్కర్‌నాయక్, గోపాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment