రోడ్డుపైనే బిల్డింగ్ మెటీరియల్
పాలమూరు నగరం వేగంగా విస్తరించి ఎన్నో కాలనీలు వెలుస్తున్నాయి. కొన్నేళ్లుగా చాలా చోట్ల కొత్త ఇళ్లు, బహుళ అంతస్తు భవనాలు (జీ ప్లస్–1, 2, 3, 4, 5) వెలుస్తున్నాయి. వీటికి సంబంధించిన మెటీరియల్ (ఇసుక, కంకర, ఇటుకలు)ను నిర్వాహకులు రోడ్డును ఆక్రమించి డంప్ చేస్తున్నారు. దీంతో పాదచారుల రాకపోకలకు అవాంతరాలు ఏర్పడుతున్నాయి. కొన్ని రోజులుగా ఏనుగొండలో రెండుచోట్ల భవన యజమానులు మెయిన్ రోడ్డుపైనే ఇసుక, ఇటుకలను పెద్ద ఎత్తున డంప్ చేశారు. అలాగే పద్మావతి కాలనీలోని ఎస్‌బీఐ పక్కన గ్రీన్‌బెల్ట్‌లో ఉన్న రాతి దిమ్మెలను పడగొట్టి ఓ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్వాహకులు ఏకంగా ఇసుక, ఇటుకలతో నింపేశారు. కృష్ణా టెంపుల్ ఆర్చ్ పక్కన మరో షాపుల యజమాని సైతం ఫుట్‌పాత్‌పై బిల్డింగ్ మెటీరియల్ పరిచేశారు.
పద్మావతికాలనీలో ప్రధాన రహదారిపై కనిపించని ఫుట్‌పాత్
వీధుల్లోనూ అదే పరిస్థితి
ఇక 49 వార్డుల పరిధిలోని ఆయా వీధుల్లో వదిలిన సెట్ బ్యాక్‌ను పూర్తి ఆక్రమించుకుని ఎక్కడికక్కడ ఇళ్ల యజమానులు బైక్‌లతో పాటు కార్లు, జీపులు, ఇతర వాహనాల కోసం ఏకంగా షెడ్లు నిర్మించుకున్నారు. అలాగే అరుగులు, రెయిలింగ్ కారణంగా చాలా చోట్ల 20–30 ఫీట్ల రోడ్డు కాస్తా 15 ఫీట్లకు కుచించుకుపోయింది. ప్రతి నిత్యం విద్యార్థుల కోసం ఉదయం, సాయంత్రం వేళ ప్రైవేట్ స్కూళ్ల బస్సులకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. అవి వివిధ గల్లీలలో యథేచ్ఛగా తిరుగుతుండటంతో పాదచారులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ బస్సులు వచ్చినప్పుడు, బైక్‌లు, ఇతర వాహనాలు సైతం వెళ్లలేని పరిస్థితి నెలకొంటోంది. దీంతో మధ్యలోనే కొద్దిసేపు ఆగిపోవాల్సి వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment