ఇలాగైతే.. నడిచేదెలా!
జిల్లాకేంద్రంలో ప్రధానరహదారిపై ఫుట్‌పాత్‌ల ఆక్రమణ
స్వచ్ఛందంగాతొలగించుకోవాలి
నగరంలోని ఎన్‌హెచ్–167పై ఎక్కడికక్కడ ఫుట్‌పాత్‌ను ఆక్రమించుకుని వివిధ వస్తువులను పెట్టుకున్న వారు వెంటనే స్వచ్ఛందంగా తొలగించుకోవాలి. లేనిపక్షంలో టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో వీటిన్నింటిని తీసి వేయిస్తాం. ఈ విషయమై ఎన్‌ఫోర్స్‌మెంట్ వాహనంలో టాంటాం చేయిస్తున్నాం. పాదచారులు ఫుట్‌పాత్‌పై వెళ్లేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఈ పాటికే ఓ ప్రైవేట్ విద్యాసంస్థ మెయిన్ రోడ్డు పై భారీగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ లను 24 గంటల్లోనే తొలగించాం.
– డి.మహేశ్వర్‌రెడ్డి, కమిషనర్, మున్సిపల్ కార్పొరేషన్
ట్రాఫిక్‌లో చిక్కుకోవాల్సిందే..
ఏౖదెనా పని నిమిత్తం బయటికి రావాలంటే ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. బైక్‌పై వెళితే క్లాక్‌టవర్, అశోక్‌టాకీస్ చౌరస్తా, కొత్త బస్టాండు, న్యూటౌన్, మెట్టుగడ్డలో తరచూ ట్రాఫిక్‌లో చిక్కుకోవాల్సి వస్తోంది. ప్రధాన రహదారిపై ఫుట్‌పాత్‌ను ఇరువైపులా కొందరు ఆక్రమించుకుని వ్యాపారాలు నిర్వహించడంతో పాదచారులు రోడ్డుపైనే నడుస్తున్నారు. దీనివల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ట్రాఫిక్‌ను నియంత్రించేలా ఆయా చౌరస్తాలలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బందిని పెంచాలి.
– తఖి హుస్సేన్, ద్విచక్ర వాహనదారుడు
●
Comments
Please login to add a commentAdd a comment