పేద, మధ్య తరగతి వర్గాలకు మేలు చేసేలా బడ్జెట్
పాలమూరు: కేంద్ర బడ్జెట్ పేద, మధ్యతరగతి వర్గాలకు ఎంతో మేలు చేసే విధంగా ఉందని, ప్రధానంగా ఆదాయపు పన్ను రూ.12 లక్షల వరకు సడలింపు చేయడం శుభ సూచికమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పాలమూరు బీజేపీ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం తెలంగాణ చౌరస్తాలో ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఎంపీ డీకే అరుణ చిత్రపటాలకు పాలభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదాయపు పన్ను వెసులుబాటు వల్ల మధ్యతరగతి వారికి ఆదాయ పన్ను మిగులుతుందన్నారు. క్యాన్సర్ బాధితులు పెరుగుతున్న క్రమంలో జిల్లాకేంద్రంలో ఒక క్యాన్సర్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు బడ్జెట్‌లో ప్రత్యేక అవకాశం కల్పించారని తెలిపారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో కేసులు ఉన్నాయని, డీపీఆర్ లేకపోవడం వల్ల కేంద్ర ప్రాజెక్టుగా పరిగణలోకి తీసుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయకుండా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు కృష్ణవర్ధన్‌రెడ్డి, క్రిస్టియన్ నాయక్, కిరణ్‌కుమార్‌రెడ్డి, రాములు, బిచ్చిరెడ్డి, పాండురంగారెడ్డి, అంజయ్య పాల్గొన్నారు.
● జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా రెండోసారి ఎంపికై న సందర్భంగా పి.శ్రీనివాస్‌రెడ్డిని మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మజారెడ్డి ఆధ్వర్యంలో పూలమాలలతో ఘనంగా సన్మానించారు
Comments
Please login to add a commentAdd a comment