రేపు ఉమ్మడి జిల్లా సాఫ్ట్‌బాల్ ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో ఈనెల 6వ తేదీన (గురువారం) మధ్యాహ్నం 3 గంటలకు ఉమ్మడి జిల్లా సీనియర్ పురుషుల సాఫ్ట్‌బాల్ జట్టు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ సభ్యులు నాగరాజు, రాఘవేందర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. వరంగల్‌లో ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్ జరుగుతాయని పేర్కొన్నారు. మిగతా వివరాల కోసం 99590 16610 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
మహిళలకు అండగా భరోసా కేంద్రం: ఎస్పీ
మహబూబ్‌నగర్ క్రైం: భరోసా కేంద్రం ద్వారా మహిళలు, పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రత్యేక చొరవ చూపాలని ఎస్పీ డి.జానకి సూచించారు. జిల్లాకేంద్రంలోని మోనప్పగుట్టలో ఉన్న భరోసా కేంద్రాన్ని మంగళవారం ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం భరోసా, షీటీం, కళా బృందం సిబ్బందితో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. బాధితులకు సలహాలు ఇవ్వడంతో పాటు మానసికంగా ధైర్యం కల్పించి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలపై వేధింపులు నివారించడానికి షీటీం చేపడుతున్న చర్యలను విస్తృతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఉమెన్ పీఎస్ ఎస్‌ఐ శ్రీనివాస్, భరోసా సెంటర్‌ఎస్‌ఐ సుజాత ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్‌కార్పొరేషన్‌కు మరో ఏసీపీ
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: పాలమూరు మున్సిపల్ కార్పొరేషన్‌కు మరో అసిస్టెంట్ సిటీ ప్లానర్ (ఏసీపీ) వచ్చారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ (టీపీఓ) పనిచేస్తున్న కె.కరుణాకర్‌గౌడ్ పదోన్నతిపై మహబూబ్‌నగర్ ఏసీపీగా బదిలీ అయ్యారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఇక్కడ విధుల్లో చేరారు. కాగా, 2023 నవంబర్ నుంచి జోత్సా ్నదేవి ఏసీపీగా పనిచేస్తున్నారు. ఈమె వారంలో మూడు రోజులు నిజాంపేటలో మిగిలిన రోజులు మహబూబ్‌నగర్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. తాజాగా దేవరకద్ర మున్సిపాలిటీకి సైతం ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఇలాంటి తరుణంలో మరొకరిని పూర్తిస్థాయిలో ఇవ్వడంతో టౌన్ ప్లానింగ్ విభాగంలో పనులు తొందరగా అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
శుభకార్యాలకు అద్దె ప్రాతిపదికన బస్సులు
● రీజినల్ మేనేజర్ సంతోష్‌కుమార్
స్టేషన్ మహబూబ్‌నగర్: వివాహాది శుభకార్యాలకు అద్దె ప్రాతిపదికన ఆర్టీసీ బస్సులు అందజేస్తామని రీజినల్ మేనేజర్ సంతోష్‌కుమార్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. రీజియన్‌లో పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులను అద్దెకు తీసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రతి కిలోమీటర్‌పై గతంలో కంటే రూ.7 తగ్గింపు అని, 6 గంటల వెయింటింగ్ చార్జి మినహాయింపు ఉంటుందన్నారు. ప్రైవేట్ వాహనాల కన్నా తక్కువ ధరలు అని తెలిపారు. డ్రైవర్ బత్తా కట్టనవసరం లేదని, సౌకర్యవంతమైన బీఎస్–6 అధునాతన టెక్నాలజీ ఉన్న కొత్త బస్సులు, చెప్పిన చోట నుంచి ఎక్కడికై నా, ఎన్ని గంటలైనా అద్దెకు తీసుకోవచ్చని తెలిపారు. బస్సులను బుకింగ్ చేసుకోవడానికి డిపోల వారీగా అచ్చంపేట – 99592 26291, గద్వాల – 99592 26290, కల్వకుర్తి – 99592 26292, కొల్లాపూర్ – 90004 05878, కోస్గి – 99592 26293, మహబూబ్‌నగర్ – 99592 26286, నాగర్‌కర్నూల్ – 99592 26288, నారాయణపేట – 99592 26293, షాద్‌నగర్ – 99592 26287, వనపర్తి – 99592 26289 నంబర్లను సంప్రదించాలని కోరారు.
ముగ్గురికి ఏఎస్‌ఐలుగా పదోన్నతి
మహబూబ్‌నగర్ క్రైం: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ముగ్గురు హెడ్‌కానిస్టేబుల్స్‌కు ఏఎస్‌ఐలుగా పదోన్నతి కల్పిస్తూ మంగళవారం జోగుళాంబ జోన్–7 డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్ ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి తర్వాత ముగ్గురికి వేరే చోట్ల పోస్టింగ్ ఇచ్చారు. ఏఎస్‌ఐలుగా పదోన్నతి పొందిన వారిలో ఎస్.శ్రీనివాసులు(మహబూబ్‌నగర్), లచ్చునాయక్ (నాగర్‌కర్నూల్), ఏ.ప్రేమ్‌కుమార్(గద్వాల)లకు పదోన్నతి కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment