యజమాని డబ్బు దొంగలించిన డ్రైవర్ అరెస్టు
జైపూర్: యజమాని డబ్బులు దొంగిలించిన కారు డ్రైవర్ జైలుపాలయ్యాడు. నమ్మకంగా పని చేయాల్సిన డ్రైవర్ డబ్బు ఆశతో ఇంటికే కన్నం వేశాడు. జైపూర్ అసిస్టెంట్ కమిషనరేట్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ వెంకటేశ్వర్లు శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్, ఎస్సై శ్రీధర్‌తో కలిసి వివరాలు వెల్లడించా రు. భీమారం మండలానికి చెందిన మూడ్ రా జేందర్ కాంట్రాక్టర్‌గా పని చేస్తూ జైపూర్‌లో సాగర్‌రావు కాంప్లెక్స్‌లో నివాసం ఉంటున్నాడు. కొంతకాలం నుంచి అతడి వద్ద ఇదే భీమారం మండలానికి చెందిన నిట్టూరి మహేశ్ కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. వ్యాపార నిమిత్తం రాజేందర్ గత నెల 8న రూ.10లక్షలు తీసుకువచ్చి అద్దె ఇంట్లో ఉంచాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గది తాళం చెవి సహాయంతో మహేశ్ ఇంట్లో ఉ న్న డబ్బును దొంగిలించాడు. బాధితుడు రాజేందర్ మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యా దు చేయగా బుధవారం ఇందారం క్రాస్ రోడ్డు వద్ద సీఐ వేణుచందర్ తన సిబ్బందితో నిందితుడిని అరెస్టు చేశారు. అతడి వద్ద రూ.8.51లక్షలు నగదు, సెల్‌ఫోన్, తాళం చెవి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment