రుణమాఫీ చేయాలని రైతుల ఆందోళన
తలమడుగు(బోథ్): రెండు లక్షలలోపు ఉన్నప్పటికీ రుణమాఫీ కాలేదని మంగళవారం ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలోని బాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్యాంకు ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులను కలిసినా సమస్య పరిష్కారం కావడంలేదన్నారు. బ్యాంకు మేనేజర్‌ను అడిగితే మేము సమాచారం పూర్తిగా పంపించామని సమాధానం ఇస్తున్నారన్నారు. ఎక్కడికి వెళ్లాలో తెలియడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం వెంటనే స్పందించి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు రాథోడ్ షేకు, జాదవ్ మణిరాం, రాథోడ్ శివలాల్, చౌహాన్ పరశురాం, రఘుపతి, వెంకట్‌రెడ్డి, లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment