ప్రమాదాల నివారణకు..
సాధారణంగా పార్కింగ్ చేసిన వాహనాల కింద జంతువులు పడుకోవడం, చిన్న పిల్లలు ఆడుకుంటూ ఉండటం గమనిస్తూ ఉంటాం. డ్రైవర్ వాహనం ముందుభ, వెనుకభాగం మాత్రమే చూసే వీలుంటుంది. కిందిభాగం చూడలేని పరిస్థితుల్లో ప్రమాదాలు సంభవిస్తాయి. వాహనం ముందు వైపు కింది భాగంలో ఒక చిన్న కెమెరా అమర్చి డ్రైవర్ ముందుభాగంలో ఉన్న స్క్రీన్‌కు లేదా స్మార్ట్ ఫోన్‌కు అనుసంధానం చేయడం వల్ల ఇలాంటి ప్రమాదాలు నివారించవచ్చు. డ్రైవర్ వాహనం స్విచ్ ఆన్‌చేసిన వెంటనే స్క్రీన్‌పై వాహన కిందిభాగం కనిపిస్తుంది. కెమెరాకు ఉన్న చిన్న మోటర్ సాయంతో కెమెరాను రొటేట్ (వాహన 360 డిగ్రీల వ్యూయర్) చేసుకోవడం వల్ల ప్రమాదాలు నివారించవచ్చు.
– రజనీకాంత్, జెడ్పీహెచ్‌ఎస్, వేమనపల్లి
Comments
Please login to add a commentAdd a comment