శ్రీరాంపూర్: కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐఎఫ్‌టీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి టీ.శ్రీనివాస్ హెచ్‌ఎంఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు టీ.సారయ్య, సింగరేణి ఉద్యోగుల సంఘం కో కన్వీనర్ సమ్ము రాజయ్య మాట్లాడుతూ సింగరేణిలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాలనే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తోందన్నారు. బుధవారం ముఖ్యమంత్రి పెద్దపల్లి సభ సందర్భంగా కార్మికుల సమస్యలపై ఐక్యవేదిక ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించామని, దీనిని అడ్డుకునేందుకు హెచ్‌ఎంఎస్ అధ్యక్షుడు రియాజ్ అహ్మద్‌ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారన్నారు. సమావేశంలో ఐఎఫ్‌టీయూ డివిజన్ అధ్యక్షుడు మేకల రాములు, సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డీ.బ్రహ్మానందం, ఏఐఎఫ్‌టీయూ నాయకులు పోచమల్లు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment